దేశంలో భారీగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు

  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,270 ఒమిక్రాన్ కేసులు
  • తెలంగాణ‌లో 62కు పెరిగిన వైనం
  • దేశంలో నిన్న మొత్తం 16,764 క‌రోనా కేసులు
  • క‌రోనా కార‌ణంగా నిన్న‌ 220 మ‌ర‌ణాలు  
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 13,154 కేసులు న‌మోదుకాగా, నిన్న 16,764 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 7,585 మంది కోలుకున్నారు. మరోపక్క, క‌రోనా కార‌ణంగా నిన్న‌ 220 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

ప్ర‌స్తుతం 91,361 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. రిక‌వ‌రీ రేటు 98.36 శాతంగా ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,270 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ‌లో 62, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 16 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని వివ‌రించింది.


More Telugu News