దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. మహారాష్ట్రలో నమోదు

  • వైరాలజీ ఇనిస్టిట్యూట్ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ
  • నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తి
  • ఇతర ఆరోగ్య సమస్యల వల్లేనన్న అధికారులు
దేశంలో కరోనా ఒమిక్రాన్ వైరస్ కారణంగా తొలిసారి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని పింప్రి చిన్వాడ్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. అతడికి కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే, అధికారులు మాత్రం అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంటున్నారు.

యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. నైజీరియా నుంచి రావడంతో కరోనా బారిన పడ్డాడు. ‘‘రోగికి 13 ఏళ్ల నుంచి మధుమేహం సమస్య ఉంది. అతడు కరోనాయేతర కారణాలతో మరణించాడు. ఒమిక్రాన్ రకం ఇన్ఫెక్షన్ బారినపడినట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రిపోర్ట్ తెలియజేసింది’’ అని అధికారులు ప్రకటన విడుదల చేశారు. 


More Telugu News