18 మందిని కొరికి గాయపరిచిన ఉడతకు మరణశిక్ష.. ఇంజెక్షన్ ఇచ్చి శిక్ష అమలు
- బ్రిటన్‌లోని బక్లీ పట్టణంలో ఘటన
- రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచిన వైనం
- ఓ సినిమాలోని విలన్ పేరు పెట్టిన స్థానికులు
- అడవిలో వదిలిపెట్టేందుకు అంగీకరించని స్థానిక చట్టాలు
మనుషులను కొరికి గాయపరుస్తున్న ఓ ఉడతకు మరణశిక్ష విధించి అమలు చేశారు. బ్రిటన్ ఫ్లింట్‌షైర్‌లోని బక్లీ పట్టణంలో జరిగిందీ ఘటన. రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచిన ఈ ఉడతకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా శిక్ష అమలు చేశారు.
ఆ వివరాలలోకి వెళితే, కొరిన్ రెనాల్డ్స్ పక్షి ప్రేమికురాలు. ఆమెకు మచ్చికైన ఓ ఉడత రోజూ వచ్చి ఆమె పెట్టే ఆహారం తీసుకునేది. ఈ క్రమంలో క్రిస్మస్‌కు కొన్ని రోజుల ముందు ఆహారం పెడుతున్న సమయంలో ఉడత ఆమె చేతిని కొరికి పారిపోయింది. తనతో ఎంతో సఖ్యతగా ఉండే ఉడత అనూహ్య ప్రవర్తనకు ఆమె విస్తుబోయింది.
ఆ తర్వాత ఓ రోజు ఫేస్‌బుక్ చూస్తున్న కొరిన్ విస్తుపోయింది. అందులో పోస్టులన్నీ దాదాపు ఉడత గురించే. ఉడత తమ చేతిని కొరికి గాయపరిచిందన్న పోస్టులు చూసి షాకయ్యారు. క్రిస్మస్ రోజున పట్టణం మొత్తం ఈ ఉడత తీరు చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఆ ఉడతకు ‘గ్రెమ్లిన్స్’ సినిమాలోని విలన్ పేరు ‘స్ట్రైప్’ అని పేరు కూడా పెట్టేశారు.
ఈ ఉడతను ఇలాగే వదిలేస్తే ప్రమాదమని భావించిన కొరిన్ దానికి ఆహారం వేసే చోట ఉచ్చు పెట్టి బంధించింది. అనంతరం ఆ ఉడతను ‘ద రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్’ సంస్థ స్వాధీనం చేసుకుంది. ప్రజలను గాయపరుస్తున్న ఆ ఉడతను అడవిలో వదిలేద్దామని తొలుత భావించారు. అయితే, అందుకు స్థానిక చట్టాలు అంగీకరించకపోవడంతో ఇంజెక్షన్ ఇచ్చి దానికి మరణశిక్ష విధించారు.