ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: జూనియర్ ఎన్టీఆర్
- 18 ఏళ్లకే హీరోగా ఎంట్రీ ఇచ్చాను
- ఆ తర్వాత కొన్ని చిత్రాలు పరాజయంపాలయ్యాయి
- అప్పుడు మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను
- అందులోంచి బయటకు తీసుకొచ్చింది రాజమౌళి
టాలీవుడ్ లో అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్... ఒకానొక సమయంలో వరుస పరాజయాలను చవిచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అప్పటి దారుణ సమయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. 18 ఏళ్లకే తాను సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చానని... తాను నటించిన రెండో సినిమాకే స్టార్ డమ్ ను చవిచూశానని ఆయన చెప్పారు.
అయితే ఆ తర్వాత వరుసగా కొన్ని చిత్రాలు పరాజయంపాలు కావడంతో తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు. తాను మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యానని... ఈ సమయంలో ఏ పనీ చేయలేకపోయానని చెప్పారు. చాలా కష్ట సమయాన్ని అనుభవించానని... అయితే ఆ డిప్రెషన్ నుంచి తనను బయటకు తీసుకొచ్చింది దర్శకుడు రాజమౌళి అని తెలిపారు. కష్టకాలంలో తన వెంట నిలిచి, తనలోని నెగెటివ్ ఫీలింగ్స్ పోయేలా చేశారని చెప్పారు. తనను ఒక మంచి నటుడిగా తీర్చిదిద్దింది కూడా రాజమౌళేనని అన్నారు.