హాలీవుడ్ స్థాయి యాక్షన్ తో అజిత్ 'వలిమై' .. ట్రైలర్ రిలీజ్!
- వినోద్ దర్శకత్వంలో 'వలిమై'
- పోలీస్ ఆఫీసర్ గా అజిత్
- ప్రతినాయకుడిగా కార్తికేయ
- జనవరి 14వ తేదీన విడుదల
అజిత్ హీరోగా బోనీకపూర్ భారీ బడ్జెట్ తో 'వలిమై' సినిమాను నిర్మించారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది.
బైక్ చేజింగ్స్ తోనే ఈ ట్రైలర్ మొదలైంది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజిత్ కనిపిస్తున్నాడు. విలన్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాల్లో భాగంగానే భారీ యాక్షన్ సీన్స్ చోటుచేసుకుంటున్నాయి. బైక్ లపై .. కార్లపై ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
యాక్షన్ తో కూడిన ఎమోషనల్ సీన్స్ కూడా ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. విలన్ గ్యాంగ్ సెటప్ చూస్తుంటే, ఈ సినిమాతో కార్తికేయ అక్కడ విలన్ గా కూడా బిజీ అవుతాడేమోనని అనిపిస్తోంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు హాలీవుడ్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డులకు తెరతీస్తుందో చూడాలి.