సినిమా టికెట్ల సమస్య అందరు నిర్మాతలది కాదు: రోజా

  • టికెట్ల ధరలు ఒకే రకంగా ఉంటేనే పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగం
  • భారీ బడ్జెట్ నిర్మాతలు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
  • బీజేపీ, టీడీపీ ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్ కు ఏమీ కాదు
వైసీపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అన్ని సినిమాల టికెట్ల ధరలు ఒకే రకంగా ఉంటేనే పేద, మధ్య తరగతి ప్రజలంతా సినిమా చూసే అవకాశం ఉంటుందని చెప్పారు. టికెట్ ధరల సమస్య అందరు నిర్మాతలది కాదని... భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు మాత్రమే టికెట్ రేట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఇక రాష్ట్రంలో వైద్య సదుపాయాలను పెంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. బీజేపీ, టీడీపీ నేతలు ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్ కు ఏమీ కాదని అన్నారు.


More Telugu News