ఒమిక్రాన్ కమ్యూనిటీ స్ప్రెడ్ మొదలైనట్టే: ఢిల్లీ ప్రభుత్వం
- ట్రావెల్ హిస్టరీ లేని వారికీ పాజిటివ్
- క్రమంగా జనాల్లోకి వెళ్లిపోతోందన్న మంత్రి
- రోజువారీ కరోనా కేసుల్లో 46% ఒమిక్రాన్ వే
ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికీ ఒమిక్రాన్ సోకుతోందని, దానర్థం ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) మొదలైపోయినట్టేనని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. ఒమిక్రాన్ క్రమంగా జనాల్లోకి వెళ్లిపోయి వ్యాప్తి మొదలైపోతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్ కేసులేనని అన్నారు. తాజా జన్యు క్రమ విశ్లేషణలో ఈ విషయం బయటపడిందన్నారు.
కాగా, నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 923 కరోనా కేసులు నమోదయ్యాయి. మే 30 నుంచి నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే అత్యధికం. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 86 శాతం అధికంగా నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో అలర్ట్ ను ప్రకటించింది.