గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు.. సీల్ చేసిన థియేట‌ర్లు తెరుచుకునేందుకు అనుమ‌తి

  • నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ సినిమా థియేటర్లు ఇటీవ‌ల మూసివేత‌
  • నేడు ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు పేర్ని నానితో చ‌ర్చ‌లు
  • అనంత‌రం ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు
  • నెల రోజుల్లో లోపాలు స‌రిచేసుకోవాల‌ని ఆదేశం
ఏపీలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ సినిమా థియేటర్లను ఇటీవ‌ల అధికారులు మూసివేయించిన విష‌యం తెలిసిందే. దాంతో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించేందుకు ఈ రోజు సినీ నటుడు, నిర్మాత‌ ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్‌ యజమానులు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానిని క‌లిసి చ‌ర్చించారు. ఆ త‌ర్వాత ప్రభుత్వం కీల‌క‌ ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో సీజ్‌ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్న‌ట్లు పేర్కొంది. ఇందుకోసం ఆయా థియేట‌ర్ల య‌జ‌మానులు జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని చెప్పారు. అలాగే, ఆయా థియేటర్లలో నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాల‌ని ఆయ‌న సూచించారు.

ఆయా థియేట‌ర్ల విష‌యంలో ఇస్తోన్న సడలింపులపై జిల్లాల‌ జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. థియేట‌ర్లు తెరుచుకోవ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తుల‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.


More Telugu News