కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
- నిన్న కూడా కోస్తాలో పలుచోట్ల వర్షాలు
- కోస్తా పైకి తేమతో కూడిన తూర్పు గాలులు
- ఉత్తరాది మీదుగా వస్తున్న పశ్చిమ గాలులు
వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాలో నిన్న కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.
బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమతో కూడిన తూర్పు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, ఉత్తరాది మీదుగా పశ్చిమ గాలులు వీస్తుండడంతో రేపటి నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.