హైదరాబాద్ శివారులో దారుణం.. విద్యార్థినిపై హెడ్మాస్టర్ అత్యాచారం
- మాస్కు పెట్టుకోలేదని బాలికను తన గదికి పిలిచిన ఉపాధ్యాయుడు
- ఈ విషయం బయట చెప్పొద్దని హెచ్చరిక
- హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు
హైదరాబాద్ శివారులోని శామిర్‌పేటలో ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు దారుణానికి తెగబడ్డాడు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామిర్‌పేటకు చెందిన ఓ విద్యార్థిని (15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 22న స్కూలుకు వెళ్లిన బాలిక మాస్కు ధరించకపోవడం చూసి తన గదికి రావాలని ప్రధానోపాధ్యాయుడు ఆదేశించాడు. గదిలోకి వచ్చిన బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను హెచ్చరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది.
గతంలో అదే పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు ఒకరు బుధవారం అక్కడికి వచ్చిన సందర్భంగా ఆమెను బాలిక కలిసింది. ఈ సందర్భంగా మాటల మధ్యలో తనపై జరిగిన దారుణాన్ని బాలిక ఆమెతో చెప్పి విలపించింది. ఆమె తానున్నానంటూ ధైర్యం చెప్పడంతో తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.