బీజేపీని ఆహ్వానించే సభలకు మమ్మల్ని పిలవొద్దు: అమరావతి రైతులను కోరిన బీవీ రాఘవులు

  • ముగిసిన సీపీఐ రాష్ట్ర మహాసభలు
  • అమరావతి రైతులకు పూర్తి మద్దతు ఉంటుందన్న సీతారాం ఏచూరి
  • కేంద్రం ఒక్క కేసును బయటకు తీసినా అమరావతే తిరిగి రాజధాని అవుతుందన్న మధు
బీజేపీని ఆహ్వానించే సభలకు తమను పిలవొద్దని సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు అమరావతి రైతులను కోరారు. విజయవాడలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభలు నిన్న ముగిశాయి. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. బీజేపీని ఆహ్వానించే సభలకు తమను పిలవొద్దని రాజధాని రైతులను కోరారు.

ఈ సభలకు హాజరైన పార్టీ జాతీయ నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. అమరావతి రైతులకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పార్టీ పరంగా అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మూడు రాజధానుల వివాదం రాజుకోవడానికి కారణమే బీజేపీ అని, ప్రధాని మోదీ ఒక్క మాట చెప్పినా మూడు రాజధానుల అంశం పక్కకు వెళ్లిపోతుందని మరో నేత మధు అన్నారు. కేంద్రం ఒక్క కేసును బయటకు తీస్తే చాలని, ప్రభుత్వం దానంతట అదే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తుందని అన్నారు.


More Telugu News