బీజేపీలో చేరిన కొన్నిరోజులకే పంజాబ్ ఎమ్మెల్యేకి జడ్ కేటగిరీ భద్రత
- కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు
- పంజాబ్ లో పెరుగుతున్న బీజేపీ హవా!
- త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు
- ఈ నెల 21న బీజేపీలో చేరిన రాణా గుర్మీత్ సింగ్
ఇటీవల పంజాబ్ లో అధికార కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు అధికమయ్యాయి. కొన్నిరోజుల కిందట ఎమ్మెల్యే రాణా గుర్మీత్ సింగ్ సోధీ కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, రాణా గుర్మీత్ సింగ్ బీజేపీలో చేరిన కొన్నిరోజులకే ఆయనకు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించడం విశేషం.
రాణా గుర్మీత్ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమరీందర్ ప్రభుత్వంలో క్రీడల మంత్రిగానూ వ్యవహరించారు. ఆయన ఇటీవల పంజాబ్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు.
రాణా గుర్మీత్ సింగ్ ఈ నెల 21న బీజేపీలో చేరారు. ఈ క్రమంలో కేంద్రం ఆయనకు ఉన్నతస్థాయి భద్రత కల్పించింది. ఇకనుంచి రాణా గుర్మీత్ సింగ్ కు సీఆర్పీఎఫ్ కమాండోలు రక్షణ కవచంలా నిలుస్తారు.