ద్విచక్ర వాహనదారులకు లీటరు పెట్రోల్ పై ఏకంగా రూ.25 తగ్గించిన ఝార్ఖండ్ సర్కారు
- దేశంలో భగ్గుమంటున్న చమురు ధరలు
- కీలక నిర్ణయం తీసుకున్న ఝార్ఖండ్ సీఎం
- జనవరి 26 నుంచి అమలు
- పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరటనిస్తున్నామన్న సీఎం
దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఝార్ఖండ్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.25 తగ్గించింది. ద్విచక్రవాహనదారులకు ఈ రాయితీ వర్తిస్తుందని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ వెల్లడించారు. ఇది జనవరి 26 నుంచి అమలు చేస్తున్నట్టు తెలిపారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గడంలేదని... పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు ఊరట ఇవ్వాలని నిర్ణయించామని సొరెన్ వెల్లడించారు. దేశంలో పెట్రోల్ ధర కొన్నాళ్లుగా రూ.100కు పైనే పలుకుతుండడం తెలిసిందే.