'ఆర్ఆర్ఆర్' వాయిదా పడొచ్చన్న వార్తలపై తరణ్ ఆదర్శ్ తాజా వివరణ
- సినిమా వాయిదా పడదు
- జనవరి 7నే విడుదల కానుంది
- రాజమౌళితో దిగిన ఫొటో పోస్ట్ చేసిన తరణ్
భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతుండడం పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడం, పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడుతుండడంతో సినిమా విడుదల విషయంలో ఆ సినిమా యూనిట్ వెనక్కి తగ్గిందని, అనుకున్న సమయానికి ఆ మూవీ విడుదల కాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.
జనవరి 7వ తేదీ నుంచి ఆ సినిమా విడుదల ముహూర్తాన్ని మార్చవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఓ సారి ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది. అయితే, ఈ సారి ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడబోదని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ స్పష్టం చేశారు.
'ఎక్స్‌క్లూజివ్.. బ్రేకింగ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేయట్లేదని ఎస్ఎస్ రాజమౌళి నాకు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా 2022, జనవరి 7నే విడుదల కానుంది' అని తరణ్ ఆదర్శ్ స్పష్టం చేశారు. అలాగే రాజమౌళితో తాను దిగిన ఫొటో పోస్ట్ చేశారు.
ఇక పాన్ ఇండియా మూవీగా రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా అనంతరం రాజమౌళి రూపొందించిన ఈ సినిమా రాబట్టనున్న వసూళ్లపై బాలీవుడ్ కూడా ఆసక్తి కనబర్చుతోంది.
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ 'పుష్ప' కూడా భారీగా వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆర్ఆర్ఆర్‌పైనే ఉంది. ఈ సినిమా కోసం నిర్మాత డీవీవీ దానయ్య భారీగా ఖర్చుపెట్టారు. ఈ సినిమాలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఇప్పటికే పలు ప్రెస్‌మీట్లు, ఈవెంట్లు నిర్వహించి ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సినీ బృందం పాల్గొంది. ఈవెంట్ల కోసం కూడా ఆ చిత్ర బృందం భారీగా ఖర్చు చేస్తోంది.