సింహాల్లా పోట్లాడుకున్న తారక్–చెర్రీ.. 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఇద్దరి మధ్య ఫైట్ అందుకేనట!

  • 16 నిమిషాల పాటు సాగే ఇంటర్వెల్ సీన్
  • బ్రిటిష్ పాలనలో పవర్ ఫుల్ పోలీస్ గా చెర్రీ
  • బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో తారక్
  • ఎన్టీఆర్ ను అరెస్ట్ చేసే సమయంలోనే భారీ ఫైట్
‘ఆర్ఆర్ఆర్’.. మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలిని మించి ఉంటుందన్న అంచనాల మధ్య సినిమా విడుదలవుతుండడం, ఎన్టీఆర్–చరణ్ కలిసి నటిస్తుండడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండడం.. ఒక్కొక్కటిగా విడుదలవుతున్న పాటల్లో తీవ్రత ఓ లెవెల్ లో ఉండడంతో మామూలుగానే సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇటీవల సినిమా ప్రమోషన్లలో ‘ఆర్ఆర్ఆర్’ టీం బిజీ బిజీ అయిపోయింది. మొన్న చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి.. హీరోల ఇంట్రడక్షన్ సీన్లు, ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోతాయని అన్నారు. ఆ సీన్ అభిమానుల ఊహకు కూడా అందదని అన్నారు. అయితే, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

16 నిమిషాల పాటు ఆ ఫైట్ సాగుతుందని అంటున్నారు. బ్రిటిష్ అధికారుల కింద ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేసే రామ్ చరణ్.. బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడే ఎన్టీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడట. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య సాగే ఫైట్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. తారక్, చెర్రీలు సింహాల్లా పోట్లాడుకున్నారట. ఒకరికి మించి మరొకరు నువ్వా–నేనా అన్నట్టు ఆ సీన్ లో లీనమైపోయారట. మరి ఆ సీన్ ను తనివితీరా చూడాలంటే మాత్రం జనవరి 7 దాకా వెయిట్ చేయాల్సిందే.


More Telugu News