'యశోద'లో సమంత పాత్ర ప్రత్యేకత అదేనట!
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'శాకుంతలం'
- సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'యశోద'
- ఇటీవలే మొదలైన షూటింగ్
- నర్స్ పాత్రలో కనిపించనున్న సమంత
సమంత ఈ మధ్య కాలంలో నాయిక ప్రధానమైన పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. 'యూ టర్న్' .. 'ఓ బేబీ' సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక నాయిక ప్రధానమైన సినిమాలలో తన కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఆమె 'శాకుంతలం' చేసింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఆమె నాయిక ప్రధానమైన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .. ఆ సినిమా పేరే 'యశోద'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, సమంత పాత్ర కూడా అంతే సాఫ్ట్ గా ఉంటుందట. ఈ సినిమాలో ఆమె ఓ సాధారణమైన నర్స్ పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.
సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. దీనిని బట్టే యశోద అనే పాత్ర చుట్టూ అనూహ్యమైన పరిస్థితులు అలముకుంటాయనే విషయం అర్థమైపోతూనే ఉంది. ఓ సాధారణమైన పాత్ర చుట్టూ అసాధారణమైన సంఘటనలు అలముకోవడమే ఈ సినిమా అంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ .. ఉన్ని ముకుందన్ .. రావు రమేశ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.