వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్.. డీజీపీకి కూడా లేఖ!
- రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై చంద్రబాబు ఆరా
- గన్‌మన్లు వద్దనడం సరికాదన్న చంద్రబాబు
- రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి వినతి
- శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని కామెంట్
తన హత్యకు కుట్ర జరుగుతోందని, ఇందుకోసం రెక్కీ నిర్వహించారని టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధాకు ఫోన్ చేసి మాట్లాడారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గన్‌మన్లు వద్దంటూ వంగవీటి రాధా చెప్పడం సరికాదని, వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వంగవీటి రాధాకు టీడీపీ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఎవరైనా కుట్రలకు పాల్పడితే అందుకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు.
మరోవైపు, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు. ఒకవేళ రాధాకు ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇప్పుడు వంగవీటి రాధాను టార్గెట్‌గా చేసుకున్నారని ఆయన చెప్పారు. ఏపీలో ఇటువంటి ఘటనలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటోన్న హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోకపోవడంతోనే ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. నేరస్థులపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కఠిన చర్యలే రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతాయని చంద్రబాబు చెప్పారు.