15 ప్యూన్ ఉద్యోగాలకు 11,000 మంది పోటీ.. న్యాయశాస్త్ర పట్టభద్రులు సైతం దరఖాస్తు

  • ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత చాలు
  • పీహెచ్ డీ, ఇంజనీర్లు సైతం పోటీ
  • పొరుగు రాష్ట్రం యూపీ నుంచి అభ్యర్థుల రాక
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు మధ్యప్రదేశ్ లో తాజా ఉద్యోగ నోటిఫికేషన్ కు వచ్చిన స్పందన తెలియజేస్తోంది. ప్యూన్లు, డ్రైవర్లు, వాచ్ మ్యాన్ లు కావాలంటూ మధ్యప్రదేశ్ సర్కారు ప్రకటన ఇచ్చింది. 11,000 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి కూడా అభ్యర్థులు తరలిరావడం ఆశ్చర్యపరిచింది. గ్వాలియర్ లోని ప్రభుత్వ కార్యాలయం ముందు వీరితో రద్దీ నెలకొంది.

10వ తరగతి విద్యార్హత అవసరమైన ఈ ఉద్యోగాలకు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, న్యాయశాస్త్ర పట్టభద్రులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పీహెచ్ డీ అభ్యర్థులు కూడా ఉన్నారు. ‘‘నేను డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. సివిల్ జడ్జి పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాను. పుస్తకాలు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బు లేదు. అందుకే నాకు ఏదో ఒక పని కావాలి’’ అని జితేంద్ర మౌర్య అనే అభ్యర్థి ఓ విలేఖరికి తెలిపాడు.


More Telugu News