తెలంగాణలో నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు: వాతావరణశాఖ
- 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి
- ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు
- నిన్న రెండు చోట్ల వర్షాలు
- రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు పేర్కొంది. అలాగే, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నిన్న కూడా రాష్ట్రంలో రెండు చోట్ల వర్షాలు పడినట్టు వివరించింది. మరోవైపు, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో చలి ప్రభావం తగ్గింది. నిన్న తెల్లవారుజామున అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా కసలాబాద్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.