మన్మోహన్ హయాంలో ఇలా జరిగి ఉంటే వెంటనే రాజీనామా చేసేవారు: రాహుల్ గాంధీ
- చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా మోదీ చూస్తూ కూర్చున్నారు
- మన్మోహన్ సింగ్ హయాంలో ఇలా ఎప్పుడూ జరగలేదు
- ఆరెస్సెస్ విద్వేషాలను రెచ్చగొడుతోంది
- విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా మోదీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడిన రాహుల్.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఆయన రాజీనామా చేసి ఉండేవారని అన్నారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఆరెస్సెస్‌పైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో అది విద్వేషాలను పెంచి పోషిస్తోందన్నారు. విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేయలేక, వాటిని చూపించుకోలేక మత రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.