కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు కిక్కెక్కించే కబురు చెప్పిన తెలంగాణ సర్కారు!
- డిసెంబరు 31న భారీగా మద్యం అమ్మకాలు!
- అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి
- రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణ
- ఆదేశాలు జారీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరాది వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు మాంచి హుషారైన కబురు చెప్పింది. డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచనున్నారు.
సాధారణంగా జనవరి 1 ముందు రోజు మద్యం ఏరులై ప్రవహించడం తెలిసిందే. ఇతరత్రా విక్రయించే మద్యం కంటే ఆ ఒక్కరోజు అమ్ముడయ్యే మద్యం ద్వారా ఎంతో ఆదాయం వస్తుంది. ఆ విధంగా తాజా నిర్ణయం ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరు అని చెప్పొచ్చు.
ఇక, డిసెంబరు 31వ తేదీ రాత్రి 1 గంట వరకు ఈవెంట్లు నిర్వహించుకోవచ్చని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.