ఓటీటీలో వస్తున్న 'వరుడు కావలెను'
- నాగశౌర్య, రీతూ వర్మ జంటగా 'వరుడు కావలెను'
- అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలైన చిత్రం
- జనవరి 7నుంచి జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభం
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను' చిత్రం అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ప్రేమ, కుటుంబ అనుబంధాల మధ్య నడిచే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది. జనవరి 7 నుంచి జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ కట్ ను జీ5 విడుదల చేసింది.
ఈ సినిమాలో ఆకాశ్ పాత్రను నాగశౌర్య, భూమి పాత్రను రీతూ వర్మ పోషించారు. రీతూ వర్మకు తల్లిగా సీనియర్ నటి నదియా నటించింది. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.