ఈ ఏడాదికి ‘బెస్ట్’ స్మార్ట్ ఫోన్లుగా నిపుణుల ఓటు వీటికే!
- డిస్ ప్లే, కెమెరా, పనితీరులో మంచి మార్కులు
- శామ్ సంగ్ నుంచి గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్
- మిగిలినవి అన్నీ చైనా కంపెనీలవే
- వీటి కనిష్ఠ ధర రూ. 40000
మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లతో మార్కెట్ ను సందడిగా మార్చేస్తున్నాయి. కానీ, వినియోగదారులకు మాత్రం ఏ ఫోన్ సరైనదో గుర్తించడం చాలా కష్టంగా మారిపోయింది. కానీ, వేలు పోసి కొనుగోలు చేసే ఫోన్ పెట్టిన డబ్బుకు సరిపడా విలువను తీసుకొచ్చేదై ఉండాలి. ఈ క్రమంలో 2021 సంవత్సరానికి మార్కెట్లోకి విడుదలైన ఫోన్లలో టాప్ 5గా ఎక్కువ మంది నిపుణుల ఓటు వీటికే ఉంది.
శామ్ సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ
6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఇన్ఫినిటీ ఓ డిస్ ప్లే. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ధర రూ.47,999. కానీ, దీపావళి సమయంలో ఆఫర్ల మీద రూ.35,000 లోపే ఇది లభించింది. ఇందులో కెమెరా పనితీరు చాలా బాగుంటుంది. డిస్ ప్లే కూడా దీనికి అదనపు ఆకర్షణ. క్వాల్ కామ్ 865 ప్రాసెసర్ ఇందులో ఉంది.
వన్ ప్లస్ 9ఆర్ 5జీ
చైనాకు చెందిన వన్ ప్లస్ బ్రాండ్ ఈ ఏడాది 9ఆర్ 5జీతో తీసుకొచ్చిన ఫోన్ వ్యాల్యూ ఫర్ మనీ విభాగం కిందకే వస్తుంది. 6.55 అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్ ఉన్న ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్586 సెన్సార్ ను ఏర్పాటు చేశారు. బ్యాటరీ బ్యాకప్, కెమెరా పరంగా మంచి పనితీరు చూపిస్తుంది. దీని ధర రూ.39,999 నుంచి ఆరంభమవుతుంది.
వివో ఎక్స్70 ప్రో 5జీ
సెప్టెంబర్ లో ఇది విడుదలైంది. ఈ ఏడాది విడుదలైన ఫోన్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఫోన్ ఇదే. ఇందులో 6.56 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. వెనుక భాగంలో 50 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెసర్ ఉంది. చూడటానికి చాలా స్టయిలిష్ గా, ప్రీమియం లుక్ తో ఆకర్షించేలా ఉంటుంది. దీని ధర రూ.46,990 నుంచి ప్రారంభమవుతుంది.
రియల్ మీ జీటీ 5జీ
ఆగస్ట్ లో విడుదలైన ఈ ఫోన్ 6.43 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. పట్టుకోవడానికి హ్యాండీగా ఉంటుంది. వెనుక భాగంలో సోనీ కంపెనీకి చెందిన 64 మెగాపిక్సల్ సెన్సార్ ను ఏర్పాటు చేశారు. క్వాల్ కామ్ 888 ప్రాసెసర్ తో వస్తుంది. దీని ధర రూ.37.999 నుంచి ప్రారంభమవుతుంది.
ఎంఐ 11 ఎక్స్ ప్రో
చైనాకు చెందిన షావోమీ ఎంఐ11 ఎక్స్ ప్రో పేరుతో విడుదల చేసిన ఫోన్ కూడా వ్యాల్యూ ఫర్ మనీయే. 6.67 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వచ్చే ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. దీని ధర రూ.39,999 నుంచి ప్రారంభం అవుతుంది.