హుస్నాబాద్ ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్‌కు చేదు అనుభ‌వం

  • గౌర‌వెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు గుడాటిప‌ల్లిలో దీక్ష 
  • వారి శిబిరానికి వెళ్లిన స‌తీశ్ కుమార్
  • ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు
  • చేసేది ఏమీ లేక వెనుదిరిగిన స‌తీశ్ కుమార్
తెలంగాణ‌లోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో నిర్వాసితుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టు కార‌ణంగా భూములు కోల్పోయిన వారు గుడాటిప‌ల్లిలో దీక్ష కొన‌సాగిస్తున్నారు. వారి శిబిరానికి వెళ్లిన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్.. నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు. అయితే, ఆ స‌మ‌యంలో స‌తీశ్ కుమార్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న మాట‌ల‌ను నిర్వాసితులు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.

ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నిర్వాసితులు నినాదాలతో హోరెత్తించారు. త‌మ‌ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాకే ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు ప్రాజెక్టు ప‌నులు జ‌ర‌గ‌నివ్వ‌బోమ‌ని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయ‌డంతో, చేసేది ఏమీలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యల పోరాటానికి ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.


More Telugu News