పోలీసులపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీసుల ఆగ్రహం!
- తమ ఎమ్మెల్యేలను పొగిడే క్రమంలో సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు
- విమర్శలు గుప్పించిన బీజేపీ, అమరీందర్ సింగ్
- పరువునష్టం నోటీసులు పంపిన పోలీసులు
తమ పార్టీ ఎమ్మెల్యేలను పొగిడే క్రమంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలు తలచుకుంటే పోలీసుల ప్యాంట్లు కూడా తడిసిపోయేలా చేయగలరని ఆయన అన్నారు. సుల్తాన్ పూర్ లోధిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసులపై సిద్ధూ తప్పుడు పదజాలాన్ని వాడటం దురదృష్టకరమని బీజేపీ విమర్శించింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ నేత దల్జీత్ సింగ్ కూడా సిద్ధూపై మండిపడ్డారు. ప్రజల కోసం శ్రమించే పోలీసులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని... వారికి సిద్ధూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని... ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చందేల్ మాట్లాడుతూ... సిద్ధూ కుటుంబాన్ని రక్షిస్తున్నది కూడా పోలీసులేనని చెప్పారు. ఆయనకు పరువునష్టం నోటీసులు పంపించినట్టు తెలిపారు.