గోవాకు పాకిన ఒమిక్రాన్.. చిన్నారికి ఒమిక్రాన్ నిర్ధారణ!

  • ఎనిమిదేళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధారణ
  • ఈ నెల 17న యూకే నుంచి వచ్చిన బాలుడు
  • యూకే ఎయిర్ పోర్టులో నిర్వహించిన టెస్టులో నెగెటివ్ వచ్చిన వైనం
మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరుకున్న ఒమిక్రాన్... తాజాగా పర్యాటకులకు స్వర్గధామమైన గోవాలో అడుగుపెట్టింది. గోవాలో 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ నెల 17న యూకే నుంచి ఈ బాలుడు వచ్చాడు. యూకే ఎయిర్ పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ అని తేలింది. దీంతో, అతను ఇండియాకు చేరుకున్నాడు.

ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ మన వైద్య సిబ్బంది అతనికి పరీక్షలను నిర్వహించింది. టెస్టుల్లో అతనికి కోవిడ్ పాజిటివ్ రావడంతో... అతని శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. ఈ పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్ సోకిందని నిర్ధారణ అయింది. గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో, గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. అతనికి కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.


More Telugu News