హీరో నాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: దిల్ రాజు

  • రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిన బాధ నానిలో ఉంది
  • ఆయన మనసులోకి వెళ్లి చూస్తే ఆయన బాధ అర్థమవుతుంది
  • నాని చెప్పింది ఒకటైతే.. జనాల్లోకి వెళ్లింది మరొకటి
సినిమా టికెట్ ధరల వ్యవహారం ఏపీలో వివాదాస్పదంగా మారింది. టికెట్ ధరలను తగ్గించడం సినీ ప్రేక్షకులను అవమానించడమేనంటూ హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో నానిపై పలువురు ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పించారు.

 మరోవైపు నాని చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని నిర్మాత దిల్ రాజు అన్నారు. తన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత రిలీజైన సినిమా తమదేనని... నాని, తన కాంబినేషన్లో వచ్చిన 'వి' సినిమా అని చెప్పారు.

నాని ఏం చెప్పాడనేది అందరూ ఆయన మనసుల్లోకి వెళ్లి చూడాలని, అప్పుడే ఆయన బాధ ఏమిటో అర్థమవుతుందని అన్నారు. తన రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిన బాధ ఆయనలో ఉందని చెప్పారు. దయచేసి నాని చేసిన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. నాని చెప్పిన విషయం ఒకటైతే... జనాల్లోకి వెళ్లింది మరొకటని అన్నారు.


More Telugu News