వీరిద్దరి బయోపిక్ లలో నటించేందుకు నేను రెడీ: ధనుష్

  • ఎవరి బయోపిక్ చేయాలనుందని ధనుష్ కు మీడియా ప్రశ్న
  • రజనీ, ఇళయరాజా అంటే తనకు ఎంతో అభిమానమన్న ధనుష్
  • వీరి బయోపిక్స్ లో నటించాలనే కోరిక ఉందని వ్యాఖ్య
తమిళ సినిమా రంగంలో ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉన్న హీరోల్లో ధనుష్ ఒకరు. 2002లో సినీ పరిశ్రమకు పరిచయమైన ఆయన.. అనతి కాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతర భాషల్లో సైతం ధనుష్ కు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో సైతం ఆయన నటించాడు. 'ఆత్రంగా రే' అనే ఈ చిత్రంలో ధనుష్ తో పాటు అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ కూడా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. బయోపిక్ లలో నటించాల్సి వస్తే ఎవరి బయోపిక్ లో నటిస్తారని మీడియా ప్రశ్నించగా... తనకు రజనీకాంత్, ఇళయరాజా అంటే ఎంతో అభిమానమని... వీరి బయోపిక్స్ లో నటించాలనే కోరిక ఉందని చెప్పారు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీని మొదలుపెట్టాడు. తాజాగా మరో తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పాడు.


More Telugu News