ఒమిక్రాన్ పంజా.. పిల్లలతో నిండిపోతున్న న్యూయార్క్ ఆసుపత్రులు!

  • అమెరికాలో  27 శాతానికి పడిపోయిన డెల్టా కేసులు 
  • 73 శాతానికి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
  • రోజుకు సగటున 1,90,000 కేసులు
అమెరికాలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ ను అధిగమించి ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం, డెల్టా కేసులు 27 శాతానికి పడిపోగా, ఒమిక్రాన్ కేసులు 73 శాతానికి పెరిగాయి. గత వారం రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు సగటున రోజుకు 1,90,000 నమోదయ్యాయి.

మరోవైపు న్యూయార్క్ లో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కోవిడ్ సంబంధిత కేసులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈ నెల 5న ప్రారంభమై ప్రస్తుత వారం వరకు ఆసుపత్రుల్లో చేరిన 18 ఏళ్ల లోపు వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. వీరిలో దాదాపు సగం మంది ఐదు సంవత్సరాలలోపు వారే ఉండటం గమనార్హం. ఐదేళ్ల లోపు వారు టీకా తీసుకునేందుకు అర్హులు కాదని న్యూయార్క్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.


More Telugu News