మెదడును మాయ చేసేస్తున్న వీడియో.. నెట్టింట్లో వైరల్ గా మారిన ‘కదిలే ఘనాలు’ వీడియో ఇదిగో!
- ట్విట్టర్ లో ఆప్టికల్ ఇల్యూజన్ వీడియో
- కదులుతున్నట్టుగా మెదడులో దిగ్భ్రమ
- వాస్తవానికి నిశ్చలంగా ఉన్న ఘనాలు
- రంగులు మారడంతో మెదడులో ఇల్యూజనరీ మోషన్ ఎఫెక్ట్
- దాని వల్లే కదులుతున్నట్టు కనిపిస్తుందని వివరణ
మనం చూసే కొన్ని విషయాలు నమ్మలేనంతగా మాయ చేస్తుంటాయి. అలాంటిదే ఆప్టికల్ ఇల్యూజన్ కూడా. మన కళ్లను, మెదడును మాయ చేసేస్తున్న అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు ‘అరె..’ అంటూ నోరెళ్ల బెట్టేస్తున్నారు.
సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో రెండు ఘనాలకు (క్యూబ్స్) సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. మామూలు వీడియో అయితే పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదుగానీ.. ఇక్కడ ఆ రెండు ఘనాలూ కదులుతున్నట్టు మనకు కనిపిస్తాయి. పైకి కిందకు, పక్కలకు కదులుతున్నట్టు, గుండ్రంగా తిరిగేస్తున్నట్టు అనిపిస్తుంది.
వాస్తవానికి ఆ రెండు ఘనాలు కదలకుండా స్థిరంగా ఉన్నాయి. అక్కడే మన మెదడును ఆ ఘనాలు మాయ చేస్తున్నాయంటున్నారు ఆ క్యూబ్స్ వీడియో గురించి తెలిసినవాళ్లు. దానికి సైంటిఫిక్ వివరణలూ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ లో కాంతి మారినప్పుడల్లా.. మన మెదడులో ఇల్యూజనరీ మోషన్ (కదిలినట్టుగా భ్రాంతి) క్రియేట్ అవుతుందని, అందుకే ఆ రెండు ఘనాలు కదిలినట్టు కనిపిస్తాయని చెబుతున్నారు. రంగు మారడంలో కాల భేదంపైనే ఈ దిగ్భ్రమ ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 14 లక్షల మంది దాకా చూశారు.