ఎన్ని నిర్బంధాలు ఉన్నా ఎర్రవెల్లికి వెళ్లి తీరతా: రేవంత్ రెడ్డి
- ఇంటి చుట్టూ పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు
- రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి తీరతాం
- ఎర్రవెల్లి గ్రామం నిషేధిత గ్రామమా?
- పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది?
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించిన విషయం తెలిసిందే. ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో ఆయనను ఇంట్లోంచి వెళ్లనివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన ఇంటి చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారని, ఇలా ఎన్ని నిర్బంధాలు ఉన్నా తాను మాత్రం ఎర్రవెల్లికి వెళ్లి తీరతానని ఆయన చెప్పారు. ఎర్రవెల్లితో తాము నిర్వహించాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. ఎర్రవెల్లి గ్రామం నిషేధిత గ్రామమా? అంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులు తమను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి వడ్ల అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.