కండ‌లు తిరిగిన శ‌రీరం.. హీరో అఖిల్ కొత్త పిక్ వైర‌ల్

  • ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో తొలి విజ‌యాన్ని అందుకున్న అఖిల్
  • ఇప్పుడు ‘ఏజెంట్’ సినిమాలో న‌టిస్తోన్న యంగ్ హీరో
  • జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ ఫొటో
త‌న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో తొలి విజ‌యాన్ని అందుకున్న అక్కినేని అఖిల్ ఇప్పుడు ‘ఏజెంట్’ సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో త‌న స‌త్తా మ‌రోసారి నిరూపించుకోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కోసం బాగా క‌స‌రత్తులు చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ గా అఖిల్ క‌న‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ సినిమాలో త‌న‌ పాత్రకు తగ్గ రీతిలో క‌న‌ప‌డేలా అఖిల్ త‌యార‌య్యాడు. ఇంత‌కుముందు ఆయ‌న జిమ్‌లో దిగిన ఓ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న బాడీ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇప్పుడు కండ‌ల వీరుడిగా క‌న‌ప‌డుతోన్న‌ అఖిల్ మ‌రో ఫొటో కూడా బ‌య‌టకు వ‌చ్చింది. కండ‌లు తిర‌గిన బాడీతో ఆయ‌న క‌న‌ప‌డుతున్నాడు. ఈ ఫొటోను అఖిల్ స్వ‌యంగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

                     
'తుపాను ముంచుకు రానుంది. అది ఎలా ఉండ‌నుందో నేను ఊహించ‌గ‌ల‌ను' అని ఆయ‌న పేర్కొన్నాడు. ఆయ‌న లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆస‌క్తిక‌ర క‌థ‌ల‌ను తెర‌కెక్కించి, హీరోల‌ను డిఫ‌రెంట్‌గా చూపించ‌డంలో సురేంద‌ర్ రెడ్డి ముందుంటారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఏజెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు ఉన్నాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి హిట్ త‌ర్వాత అఖిల్ ఈ సినిమాలో న‌టిస్తుండ‌డం ఈ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్.  



More Telugu News