వాట్సాప్ కాల్ రింగ్ ఫోన్ స్క్రీన్ పై కనిపించడం లేదా..? పరిష్కారం ఇదిగో!

  • నోటిఫికేషన్ సెట్టింగ్స్ పరిశీలించుకోవాలి
  • డు నాట్ డిస్టర్బ్ ను ఆఫ్ చేసుకోవాలి
  • బ్యాక్ గ్రౌండ్ డేటా సేవర్, బ్యాటరీ సేవర్ ఆఫ్ లో ఉండాలి
  • చివరిగా డిలీట్ చేసుకుని, రీ ఇన్ స్టాల్ ఒక్కటే పరిష్కారం
ఫోన్ లాక్ అయి ఉన్న సమయాల్లో వాట్సాప్ కాల్ వస్తే రింగ్ పైకి వినిపించకపోవడం.. స్క్రీన్ అన్ లాక్ లో వుండి, చూస్తున్న సందర్భాల్లోనూ వాట్సాప్ కాల్ వస్తే రింగ్ అవుతుంది కానీ, స్క్రీన్ పై కనిపించకుండా ఉండటం చాలా మందికి అనుభవమయ్యే ఉంటుంది. ఈ సమస్యకు పలు పరిష్కారాలున్నాయి.

'డు నాట్ డిస్టర్బ్'ను ఫోన్ లో యాక్టివేట్ చేసుకున్న సందర్భాల్లో వాట్సాప్ కాల్ వచ్చినా అది మీకు తెలియదు. సెట్టింగ్స్ లో సౌండ్స్ విభాగంలో ఈ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ యాక్టివేట్ అయి ఉంటే డిసేబుల్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్ పై భాగం నుంచి కిందకు డ్రాగ్ చేసినప్పుడు మెనూలో కూడా కనిపిస్తుంది. సమస్య ఇది కాకపోతే తర్వాతి ఆప్షన్ కు వెళ్లాలి.

వాట్సాప్ నోటిఫికేషన్లను చాలా మంది డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి డిసేబుల్ చేసుకుంటుంటారు. అలాంటప్పుడు కూడా నోటిఫికేషన్స్ కనిపించవు. అందుకని యాప్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ కు వెళ్లి వాట్సాప్ నోటిఫికేషన్లను యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు టెక్స్ట్, కాల్స్ నోటిఫికేషన్లు హోమ్ స్క్రీన్ పై తెలుస్తాయి.

యాప్ క్యాచే క్లియర్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లో యాప్ అండ్ నోటిఫికేషన్స్ కు వెళ్లాలి. వాట్సాప్ ను సెలక్ట్ చేసుకుని, స్టోరేజ్ అండ్ క్యాచేకు వెళ్లి క్లియర్ చేసుకోవాలి. వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవడం ద్వారా సమస్య పరిష్కారం కావచ్చు. అందుకని ప్లే స్టోర్ లో మైయాప్స్ కు వెళ్లి వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.

స్మార్ట్ ఫోన్ లాక్ అయిన తర్వాత బ్యాంక్ గ్రౌండ్ లో యాప్స్ పనిచేస్తూనే ఉంటాయి. డేటా పొదుపు ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే.. స్క్రీన్ లాక్ అయిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ పనిచేయవు. అటువంటి సందర్భాల్లో వాట్సాప్ కాల్, టెక్ట్స్ నోటిఫికేషన్లు కనిపించవు.

బ్యాటరీ సేవర్ ను ఎంపిక చేసుకుంటే డిసేబుల్ చేసుకోవాలి. ఫోన్ లోని గూగుల్ ప్లే సర్వీసెస్ యాప్ ను కూడా అప్ డేట్ చేసుకోండి. అప్పటికీ సమస్య పరిష్కారం అవ్వకపోతే వాట్సాప్ యాప్ ను డిలీట్ చేసుకుని.. తిరిగి ప్లే స్టోర్ నుంచి తాజాగా డౌన్ లోడ్ చేసుకోవాలి.


More Telugu News