'కల్ట్ గ్యాంగ్' నుంచి మాస్ మసాలా సాంగ్!
- కమెడియన్ గా మంచి గుర్తింపు
- హీరోగా తొలి ప్రయత్నం
- నిర్మాతగా మారిన మహేశ్ విట్టా
- త్వరలో సినిమా విడుదల
కమెడియన్స్ గా పాప్యులర్ అయినవారిలో చాలామంది తదనంతర కాలంలో హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బ్రహ్మానందం .. అలీ .. సునీల్ వీరంతా కూడా ఆ దారిలో అడుగులు వేసినవారే. ఇక ఈ జనరేషన్ లో అలా సప్తగిరి .. షకలక శంకర్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మహేశ్ విట్టా కూడా చేరిపోయాడు.
మహేశ్ విట్టా గ్రామీణ నేపథ్యంలో నడిచే కథలకు బాగా సెట్ అవుతాడు. తనదైన యాస డైలాగ్స్ తో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు తనని తాను తెరపై హీరోగా చూసుకోవడం కోసం నిర్మాతగా కూడా మారిపోయాడు. 'కల్ట్ గ్యాంగ్' పేరుతో ఆయన ఒక సినిమాను నిర్మించాడు.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "మీసాలోడా ఏమయింది .. గజ్జెల సప్పుడు లాగా ఉంది, తాళం ఎందుకు తడబడుతోంది .. తడబడితే పొరబాటేముంది" అంటూ ఈ పాట సాగుతుంది. జాన్ జోసఫ్ అందించిన బీట్ .. భరద్వాజ్ సాహిత్యం సందర్భానికి తగినట్టుగా ఉన్నాయి. హర్ష కావలి దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.