పామును చేత్తో పట్టుకున్నప్పుడు అది కాటేసింది: సల్మాన్ వివరణ
- బర్త్ డే పార్టీ కోసం ఫామ్ హౌస్ కి వెళ్లిన సల్మాన్
- కర్రతో తీసి బయట పడేసే ప్రయత్నం
- ఆ సమయంలో చేతిపైకి వచ్చిన పాము
- పట్టుకుని విడిచే క్రమంలో కాటు
- ఆరు గంటల పాటు ఆసుపత్రిలో సల్మాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు పాముల్ని పట్టడంలో నైపుణ్యం లేదు. అయినా కానీ, తన వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో కనిపించిన ఓ పామును పట్టుకునే సాహసం చేశాడు. ఫలితంగా పాము కాటుకు గురయ్యాడు. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. ఈ రోజు ఈ బాలీవుడ్ నట దిగ్గజం 56వ పుట్టిన రోజు. ఈ వేడుకల కోసం ఆయన శనివారం రాత్రే ముంబైకి సమీపంలోని పాన్వెల్ లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు.
ఆదివారం తెల్లవారుజామున ఫామ్ హౌస్ లో బయటకు వచ్చినప్పుడు పాము కంటపడింది. సిబ్బంది చాలా మంది ఉన్నా కానీ, పాము సంగతి చూద్దామని సల్మాన్ స్వయంగా దాన్ని బయటకు పంపించే పనిని మొదలు పెట్టాడు.
‘‘ఒక పాము నా ఫామ్ హౌస్ లో కనిపించింది. కర్రతో దాన్ని బయటకు తీసుకెళ్లాను. అది క్రమంగా స్టిక్ మీద నుంచి నా చేతి పైకి వచ్చింది. దాన్ని చేత్తో పట్టుకుని విడిచిపెట్టే ప్రయత్నం చేశాను. ఆ సమయంలోనే నన్ను కాటు వేసింది. అదొక రకమైన విష పాము. ఆరు గంటల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నాను’’ అని సల్మాన్ ఖాన్ ఓ వార్తా సంస్థకు తెలిపాడు.
పాము కాటుకు చికిత్స తీసుకున్నప్పటికీ, ఆదివారం రాత్రి తన పుట్టిన రోజు వేడుకలను సల్మాన్ ప్రతి సంవత్సరం మాదిరే నిర్వహించాడు. లెదర్ జాకెట్ వేసుకుని హుషారుగా కనిపించాడు.