తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
- ఈ ఉదయం 6-7.30 గంటల ప్రాంతంలో ఘటన
- మృతి చెందిన మావోల్లో నలుగురు మహిళా నక్సలైట్లు
- చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు కూడా మృతి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
చర్ల మండలానికి 25 కిలోమీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 6-7.30 గంటల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల్లో నలుగురు మహిళా నక్సల్స్‌తోపాటు చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు కూడా మృతి చెందారు. కాగా, ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.