రాజమండ్రిలో ఈరోజు సినిమా థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ
- ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సినిమా టికెట్ల వ్యవహారం
- ఇప్పటికే 50కి పైగా థియేటర్ల సీజ్
- కీలక నిర్ణయాలు తీసుకోనున్న యాజమాన్యాలు,
సినిమా టికెట్ ధరల వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం తగ్గించిన టికెట్ ధరలతో తమకు గిట్టుబాటు కాదని థియేటర్ యాజమాన్యాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. టికెట్ ధరలు, ధ్రువీకరణ పత్రాలు, తినుబండారాల ధరలు.. ఇలా అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 50కి పైగా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. మరి కొన్నింటిని థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా మూసి వేశారు.
ఈ క్రమంలో ఈరోజు రాజమండ్రిలో సినిమా థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతికి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ ధరలు వసూళ్లపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు టికెట్ ధరలపై ఏపీ హైకోర్టు ఈరోజు మరోసారి విచారణ చేపట్టనుంది. ఇదిలావుంచితే, టికెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.