ఆనందయ్య వంటకం, స్వరూపానందస్వామి భజనలతో ఒమిక్రాన్ తగ్గదు: హేతువాద సంఘం

  • ఐఎంఏ, ఆయుష్ ఆమోదం పొందిన మందులే వాడాలి
  • భజనలతోనూ, ఆవు నెయ్యితోనూ కరోనా తగ్గదు
  • గో మూత్రంతో ఒమిక్రాన్ తగ్గుతుందని బీజేపీ నేతల అసత్య ప్రచారాలు
ఆనందయ్య వంటకంతో కానీ, స్వరూపానంద చెప్పినట్టు భజనలతో కానీ ఒమిక్రాన్ వేరియంట్‌ నయం కాదని హేతువాద సంఘం ఏపీ అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు. ఒమిక్రాన్ కారణంగా థర్డ్ వేవ్ వస్తుందని, ఫిబ్రవరిలో కేసులు పతాక స్థాయికి చేరుకుంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆయుష్ ఆమోదం పొందిన మందులనే వాడాలని సూచించారు.

ఆనందయ్య లాంటి వారు తమ మందులతో ఒమిక్రాన్‌ను వెళ్లగొట్టేస్తామని చెబుతున్నారని, పరిపూర్ణానందస్వామి ఆవు నెయ్యితో సూర్యుడిని ప్రార్థించాలని చెబుతుంటే, స్వరూపానందస్వామి భజనలు చేయాలని చెబుతున్నారని విమర్శించారు. మరోవైపు, బీజేపీ నేతలు మాత్రం ఆవు మూత్రంతో ఒమిక్రాన్ నయమవుతుందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు.


More Telugu News