గర్భిణులకు కొవిడ్ సోకితే శిశువుల పరిస్థితేంటి?.. అనేక సందేహాలకు సమాధానాలు ఇవిగో..!

  • అధ్యయనంలో పలు విషయాల వెల్లడి
  • గర్భిణులకు కరోనా సోకినా పిల్లలకు సంక్రమించే ప్రమాదం తక్కువే
  • కరోనా బారినపడిన తల్లి పాలు తాగినా పిల్లలు సేఫ్
గర్భిణులకు కరోనా సోకితే అది పుట్టే పిల్లలను కూడా వదిలిపెట్టదని, కొవిడ్ సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకూ అది సంక్రమిస్తుందన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. తాజా అధ్యయనంలో వెల్లడైన విషయాలు మహిళల్లో పేరుకుపోయిన ఇలాంటి ఎన్నో సందేహాలను తీర్చే ప్రయత్నం చేశాయి.

గర్భిణులకు కరోనా సోకినప్పటికీ వారు భయడాల్సిన అవసరం లేదని, గర్భంలోని శిశువుకు వైరస్ సోకే ప్రమాదం లేదని అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, శిశువు ఆరోగ్యం, పెరుగుదల విషయంలోనూ ఎలాంటి సమస్య ఉండదని స్పష్టమైందని అధ్యయనకారులు తెలిపారు.

పరిశోధనలో భాగంగా టీకా తీసుకోవడానికి ముందు కరోనా బారినపడిన గర్భిణులపై ఆరు నెలలపాటు అధ్యయనం చేశారు. వీరిలో 55 శాతం మంది ప్రసవం జరిగిన 10 రోజుల్లోపే కరోనా బారినపడ్డారు. దీంతో వారి శిశువులకు కరోనా పరీక్షలు చేయగా వారికి నెగటివ్ గా తేలింది.

అంటే, కరోనా సోకిన తల్లి పాలు తాగినప్పటికీ శిశువులకు అది సోకలేదని నిర్ధారణ అయింది. ఇలాగే ఈ అధ్యయనంలో ఎన్నో ఊరటనిచ్చే విషయాలు వెలుగుచూశాయని జర్నల్ సీనియర్ రచయిత, పిల్లల వైద్యురాలు, ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మల్లికా షా పేర్కొన్నారు.


More Telugu News