మహిళలపై మరో హుకుం జారీ చేసిన తాలిబన్లు

  • ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన
  • ఇప్పటికే అనేక ఆంక్షలు
  • తాజా ప్రకటనతో హక్కుల కార్యకర్తల ఆగ్రహం
  • దూర ప్రయాణాల్లో మహిళల వెంట పురుషుడు ఉండాలని ఆదేశం
ఆఫ్ఘనిస్థాన్ లో పాలన సాగిస్తున్న తాలిబన్లు మహిళలపై మరో హుకుం చేశారు. దూర ప్రయాణాలు చేసే మహిళలు కచ్చితంగా పురుషుడి తోడు తీసుకోవాలని ఆదేశించారు. దూర ప్రాంతాలకు వెళ్లే మహిళల వెంట కచ్చితంగా పురుషులు ఉండాల్సిందేనని, పురుషులు లేకుండా వచ్చే మహిళలకు రవాణా సౌకర్యం కల్పించరాదని తాలిబన్ సర్కారు స్పష్టం చేసింది. 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలంటే కచ్చితంగా పురుషుడు వెంట రావాల్సిందేనన్నది ఆ ప్రకటన సారాంశం.  

ఈ ప్రకటనపై ఆఫ్ఘనిస్థాన్ లోని హక్కుల కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆఫ్ఘన్ లో మహిళలపై అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజా ప్రకటనతో తాలిబన్ల విశ్వసనీయతపై మరోమారు సందేహాలు బయల్దేరాయి.


More Telugu News