కలర్ జిరాక్స్ తో నకిలీ నోట్లు... గుంటూరు జిల్లా నడికుడి కేంద్రంగా కార్యకలాపాలు
- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
- ముఠా సభ్యుల అరెస్ట్
- రూ.45 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం
- ఇప్పటివరకు రూ.2.2 లక్షల నకిలీ నోట్ల చలామణీ
గుంటూరు జిల్లాలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడికుడిలో కలర్ జిరాక్స్ ద్వారా నకిలీ నోట్లు తయారుచేస్తున్నట్టు గుర్తించారు. రూ.500, రూ.200 నోట్లు ముద్రించి రూ.2.2 లక్షల మేర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చలామణీ చేసినట్టు గుర్తించారు.
కాగా ఈ ముఠా సభ్యులు గుంటూరు జిల్లాలోని దుర్గి, అచ్చంపేట, రెంటచింతల, దాచేపల్లి ప్రాంతాలకు చెందినవారని జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. వారి నుంచి ఓ కంప్యూటర్, పలు ప్రింటర్లు, స్కానర్, రూ.45 లక్షల విలువైన నకిలీ నోట్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.