సీజేఐ హోదాలో తొలిసారి అమరావతి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ... హైకోర్టులో ఘన సన్మానం
- తెలుగు రాష్ట్రాల్లో సీజేఐ పర్యటన
- స్వగ్రామాన్ని కూడా సందర్శించిన ఎన్వీ రమణ
- నేడు అమరావతి రాక
- గజమాలతో సన్మానించిన జడ్జిలు, న్యాయవాదులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐ హోదాలో తొలిసారి అమరావతి విచ్చేశారు. కొన్నిరోజులుగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చిన ఆయన నేడు అమరావతి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనకు రాజధాని జేఏసీ నేతలు, రైతులు రాయపూడి వద్ద ఘనస్వాగతం పలికారు. ఆకుపచ్చ కండువాలు ధరించి, జాతీయ జెండాలు చేతబూని నినాదాలు చేశారు. ఓపెన్ టాప్ కారులో వచ్చిన ఎన్వీ రమణ, పైకి లేచి నిల్చుని రైతులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన ఏపీ హైకోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది సీజేఐ ఎన్వీ రమణ దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు, పెద్ద సంఖ్యలో జ్ఞాపికలు బహూకరించారు.