మ‌రోసారి యూపీలో అధికారంలోకి వ‌స్తే రాష్ట్రాన్ని అమెరికాలా మార్చుతాం: గ‌డ్క‌రీ

  • యూపీలో భారీగా రోడ్లు వేయిస్తాం
  • ఇప్ప‌టికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోడ్లు బాగుపడ్డాయి
  • కొత్త రోడ్లు నిర్మించాం
  • యూపీలోనూ ఈ అభివృద్ధి కొనసాగుతుంది
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మ‌రికొన్ని నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు పార్టీలు ప్ర‌చారాన్ని షురూ చేశాయి. ప్ర‌జ‌ల‌కు హామీల వ‌ర్షం కురిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడుతూ.. యూపీలో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ లో రోడ్లకు 5 లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తామని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలోని రోడ్లను అమెరికాలోని రోడ్లలా తీర్చి దిద్దుతామని అన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ను అమెరికాలా మార్చుతామ‌ని ఆయ‌న చెప్పారు. త‌మ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్ప‌టికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోడ్లు బాగుపడ్డాయని, కొత్త రోడ్లు నిర్మించామ‌ని చెప్పారు. యూపీలోనూ  ఈ అభివృద్ధి కొనసాగుతుందని ఆయ‌న అన్నారు.


More Telugu News