ఏపీలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ
- దక్షిణాఫ్రికా నుంచి ఒంగోలు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్
- యూకే వచ్చిన వ్యక్తికి కూడా
- ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు. దక్షిణాఫ్రికా నుంచి స్వస్థలానికి వచ్చిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి (48)కి కరోనా పరీక్షలు చేశామని వివరించారు. అనంతరం 19 వ తేదీన ఆ నమునాను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం పరీక్షలకు పంపించగా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు.
అంతేగాక, యూకే నుంచి ఇటీవల అనంతపురం వచ్చిన మరో వ్యక్తి (51)కి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని వివరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరిందని అధికారులు చెప్పారు. ఒమిక్రాన్ బాధితుల కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఏపీకి విదేశాల నుంచి 67 మంది వచ్చినట్లు వివరించారు.