'ఇక ఆట మొదలు పెడదాం' అంటూ టీమిండియా వీడియో పోస్ట్ చేసిన బీసీసీఐ
- దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన
- నేడు తొలి టెస్టు మ్యాచు ప్రారంభం
- కోహ్లీ సారథ్యంలో ఆడుతోన్న భారత్
- కరోనా నిబంధనల మధ్య సిరీస్
దక్షిణాఫ్రికా-భారత్ క్రికెట్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టుల్లో బాగా రాణిస్తోన్న భారత్ ఈ సిరీస్ గెలవాలన్న కసితో ఉంది. టెస్టు మ్యాచుకు టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా జట్టు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తీసిన భారత క్రికెటర్లకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
భారత ఆటగాళ్లు విమానం ఎక్కడం నుంచి దక్షిణాఫ్రికాలో ల్యాండ్ అవ్వడం, అక్కడి మైదానంలో సాధనం చేయడం వరకు అన్ని దృశ్యాలను ఇందులో బీసీసీఐ చూపించింది. తోటి ఆటగాళ్లతో కలిసి కోహ్లీ మైదానంలో సాధన చేశాడు. ఇటీవల భారత క్రికెట్లో వివాదాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.
వన్డేల నుంచి కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తొలగించారు. దీంతో ఇప్పుడు కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల బీసీసీఐ, కోహ్లీ మద్దతుదారులకు మధ్య మాటలతూటాలు కూడా పేలాయి. కోహ్లీకి మద్దతు తెలుపుతూ పలువురు మాజీ క్రికెటర్లు కూడా పలు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. అంతేగాక, ఇటీవలే టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమితుడయ్యాడు.
ఈ పరిణామాల అనంతరం భారత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో అనేక జాగ్రత్తల మధ్య ఈ సిరీస్ ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా భారత ఆటగాళ్లు ఫేస్ షీల్డ్ ధరించి ఉండడం ఈ వీడియోలో చూడొచ్చు.