ఆరోగ్యం కోసం విటమిన్ మాత్రలను అదే పనిగా వాడుతున్నారా..? జాగ్రత్త!
- అన్నీ పరిమితంగానే తీసుకోవాలి
- ఎక్కువ మోతాదుతో దుష్ప్రభవాలు
- అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టే
- వైద్యుల సూచనల మేరకు వాడుకోవడం మంచిది
కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అవగాహన చాలా మందిలో పెరిగింది. వ్యాధి నిరోధక శక్తి ప్రాధాన్యం గురించి తెలుసుకుంటున్నారు. ఎక్కువ మంది విటమిన్లు, మినరల్ మాత్రలను అదే పనిగా తీసుకుంటున్నవారూ ఉన్నారు. కాకపోతే ‘అతి అనర్థదాయకం’ అన్న సూత్రం దీనికి వర్తిస్తుందని గుర్తు పెట్టుకోవాలి. మోతాదు మేరకు విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందిస్తే చాలా మేలు జరుగుతుంది. మోతాదు ఎక్కువ అయితే అనర్థాలూ ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని వనరులు అందేలా చూసుకోవచ్చు. అప్పుడు రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆచరణలో సరైన, సమతుల పోషకాహారం తీసుకోలేని వారు, చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, పోషకాలు తక్కువగా అందే వారు వైద్యుల సూచనల మేరకు విటమిన్, మినరల్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు. సొంతంగా వాడేట్టు అయితే పరిమితి దాటకుండా చూసుకోవాలి.
విటమిన్లు రెండు రకాలున్నాయి. వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ విటమిన్లు తీసుకున్నప్పుడు శరీరం కావాల్సినంత తీసుకోగా, మిగిలినవి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్లే ఎక్కువగా ఉన్నాయి. అవి.. విటమిన్ బి1 (థయమిన్), విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్), విటమిన్ బి3 (నియాసిన్), విటమిన్ బి5 (పాంతోతేనిక్ యాసిడ్), విటమిన్ బి6 (పైరిడాక్సిన్), విటమిన్ బి7 (బయోటిన్), విటమిన్ బి9 (ఫొలేట్), విటమిన్ బి12 (కోబాలమిన్).
వాటర్ సాల్యుబుల్ అంటే నిల్వ ఉండకుండా విసర్జితమయ్యేవి. కనుక కొంచెం మోతాదు ఎక్కువ అయినా వీటితో ప్రమాదం ఉండదు. కానీ, శరీరానికి కావాల్సిన మోతాదు కంటే చాలా ఎక్కువ రెట్లలో ఇస్తే మాత్రం దుష్ప్రభవాలు ఎదుర్కోవాల్సిందే. విటమిన్ సీ రోజుకు కావాల్సింది 95 మిల్లీగ్రాములు. ఇంతకు మించితే వాంతులు, తలనొప్పి రావచ్చు. జీర్ణాశయ క్రియలు అస్తవ్యస్తం అవుతాయి. ముఖ్యంగా రోజుకు రెండు గ్రాములు మించి తీసుకుంటే మైగ్రెయిన్ తలనొప్పికి దారితీస్తుంది.
విటమిన్ బి3ని నికోటినిక్ యాసిడ్ రూపంలో అధిక మోతాదాలో తీసుకుంటే అధిక బ్లడ్ ప్రజర్, పొట్టలో నొప్పి, చూపు దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం జరగొచ్చు. ముఖ్యంగా రోజుకు 1-3 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే ఇలా జరుగుతుంది. విటమిన్ బి6 ఎక్కువైతే (1 గ్రామునకు మించి) నాడీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ బి9, బి12ను ఎక్కువగా తీసుకుంటే మానసిక పరిస్థితిలో మార్పు రావచ్చు. రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జింక్ కూడా వాటర్ సాల్యుబుల్. ఎక్కువైతే అజీర్ణంతో బాధపడాల్సి రావచ్చు.
ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అంటే.. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. అంటే ఇవి నీటిలో కరగవు. కనుక మోతాదు ఎక్కువైతే శరీరంలోనే ఉండి హాని చేస్తాయి. మిగిలిన మూడింటితో పోలిస్తే విటమిన్ కే తో దుష్ప్రభావాలు తక్కువ. విటమిన్ ఏ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. జుట్టు రాలిపోయే సమస్య వస్తుంది. చర్మం పొడిబారడం, ఎముకల నొప్పులు కనిపిస్తాయి. విటమిన్ డీ ఎక్కువైతే బరువు, ఆకలి తగ్గడం, గుండె కొట్టుకునే వేగం ఎక్కువ కావడం కనిపించొచ్చు. విటమిన్ ఈ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ క్లాట్, స్ట్రోక్ సమస్యకు దారితీయవచ్చు.