తెలంగాణలో కొత్తగా 140 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- కరోనా నుంచి కోలుకున్న 186 మంది
- రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరి మృతి
- రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,499
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 140 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.89 శాతంగా ఉంది.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,553కి చేరింది. అలాగే మొత్తం 6,73,033 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,021 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,499 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 333 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ 8 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. రాష్ట్రంలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.