సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు.. సాదరంగా ఆహ్వానించిన జగన్ దంపతులు.. ఫొటోలు ఇవిగో!
- విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో విందు
- సీజేఐకి మంత్రులను పరిచయం చేసిన సీఎం
- కార్యక్రమానికి హాజరైన ఏపీ, టీఎస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ లు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందును ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్వీ రమణ దంపతులకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ హైకోర్టుల చీఫ్ జస్టిస్ లు, న్యాయమూర్తులు, ఏపీ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐకి మంత్రులను జగన్ పరిచయం చేశారు.
మరోవైపు సీజేఐ ఎన్వీ రమణ దంపతులను రోటరీ క్లబ్ సత్కరించింది. జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. నగరంలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు ఏపీ, టీఎస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ లు హాజరయ్యారు.