తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు
- తెలంగాణలో 41కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
- విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి ఒమిక్రాన్
- వారికి కాంటాక్టులోకి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్న అధికారులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. కొత్తగా ఒమిక్రాన్ తో బాధపడుతున్నట్టు తేలిన ముగ్గురు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారే.
అయితే ఈ ముగ్గురు ఇంకెవరినైనా కలిశారా? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారి కాంటాక్టులను సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యూఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఈరోజు నుంచి జనవరి 2 వరకు ఆంక్షలను అమలు చేయనుంది. వేడుకల సమయంలో సామాజిక దూరం పాటించాలని, మాస్కులు విధిగా ధరించాలని ఆదేశించింది. ర్యాలీలు, సభలపై నిషేధం విధించింది.