సినీ నటి కరాటే కల్యాణిపై కేసు నమోదు
- హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ లో కేసు నమోదు
- గతంలో హత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టిన కల్యాణి
- చట్ట ప్రకారం బాధితుల వివరాలను బయటపెట్టకూడదు
సినీ నటి కరాటే కల్యాణిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, గతంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఓ బాలికపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. హత్యాచారానికి పాల్పడిన నిందితుడు చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదిలావుంచితే, చట్టప్రకారం అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బయటపెట్టకూడదు. అయితే, ఆ వివరాలను కల్యాణి బయటపెట్టారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టులో జగద్గిరిగుట్ట వాసి నితీశ్ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెపై జగద్గిరిగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది.